సినిమాల్లోకి రానున్న రవితేజ కుమారుడు!


చివరగా ‘బెంగాల్ టైగర్’ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించిన స్టార్ హీరో రవితేజ మధ్యలో కొంత గ్యాప్ తీస్కుని వరుసగా ‘రాజా ది గ్రేట్, టచ్ చేసి చూడు’ అనే రెండు సినిమాలు చేస్తున్నారు. వీటిలో ‘రాజా ది గ్రేట్’ అన్ని పనులు పూర్తిచేసుకుని అక్టోబర్ 12న రిలీజయ్యేందుకు రెడీ అవుతోంది. ఇకపోతే ఈ సినిమాతో రవితేజ కుమారుడు మహాధన కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు.

ఈ సినిమాలో మహాధన్ చిన్నప్పటి రవితేజగా కనిపించనున్నాడు. దర్శకుడు అనిల్ రావిపూడి, దిల్ రాజులు కలిసి మహాధన అయితే రవితేజ చిన్ననాటి పాత్రను చేయడానికి సరిపోతాడని భావించి ఈ నిర్ణయం తీసుకున్నారట. మెహ్రీన్ కౌర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో రవితేజ చూపులేని వ్యక్తిగా కనిపించనున్నారు. ఇటీవలే విడుదలైన టీజర్ కూడా ఆకట్టుకోవడంతో సినిమాపై ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ నెలకొంది.