హెవీ యాక్షన్ ఎపిసోడ్ కు సిద్దమవుతున్న రవితేజ !


మాస్ మహారాజ రవితేజ్ ప్రస్తుతం రెండు సినిమాలను చేస్తున్న సంగతి తెలిసిందే. వాటిలో ఒకటి ‘టచ్ చేసి చూడు’ కాగా మరొకటి ‘రాజా ది గ్రేట్’. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తున్న ఈ ‘రాజా ది గ్రేట్’ లో రవితేజ్ చూపులేని వ్యక్తిగా కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన టీజర్ ప్రేక్షకులకు బాగా నచ్చడంతో సినిమాపై కూడా మంచి క్రేజ్ నెలకొంది. ఎంటర్టైన్మెంట్ తో పాటు యాక్షన్ కూడా ఉండేలా ఈ సినిమాను రూపొందిస్తున్నారు.

ప్రస్తుతం చిత్ర యూనిట్ ఛత్తీస్ గఢ్ లోని రాయగఢ్ లో భారీ యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణకు సిద్ధమైంది. ఈ యాక్షన్ ఎపిసోడ్ మొత్తం ట్రైన్ బ్యాక్ డ్రాప్లో ఉండనుందట. అంతేగాక ఈ ఎపిసోడ్ సినిమాకే హైలెట్ గా నిలుస్తుందని కూడా అంటున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని అక్టోబర్ 12న రిలీజ్ చేయనున్నారు. ఇందులో మెహ్రీన్ కౌర్ హీరోయిన్ గా నటిస్తుండగా రాశీ ఖన్నా కూడా ఒక పాటలో మెరవనుంది.