డైరెక్ట్ ఓటిటిలో రవిబాబు నుంచి లేటెస్ట్ థ్రిల్లర్.!

Published on Mar 19, 2023 1:34 pm IST

ఇప్పుడు టాలీవుడ్ సినిమా దగ్గర గాని తమిళ్ సినిమాలో గాని ఇప్పుడు వస్తున్న క్రైమ్ థ్రిల్లర్స్ ఏమో గాని కొన్నాళ్ల కితం మన టాలీవుడ్ టాలెంటెడ్ దర్శకుడు మరియు నటుడు అయినటువంటి రవిబాబు తెరకెక్కించిన అనసూయ, అమరావతి లాంటి థ్రిల్లర్స్ ఆడియెన్స్ లో స్పెషల్ ప్లేస్ ని సొంతం చేసుకున్నాయి. థ్రిల్లర్, కామెడీ అలాగే హారర్ బ్యాక్ డ్రాప్ లో తాను చేసే సినిమాలు యూనిక్ గా టచ్ చేస్తూ ఉంటాడు.

మరి అలా చాలా కాలం తర్వాత అయితే తాను చేసిన లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం “అసలు”. రవిబాబు ఆల్రెడీ చేసిన అవును 1, 2 అలాగే లడ్డు బాబు సినిమాలో హీరోయిన్ పూర్ణ ఈ సినిమాలో నటించింది. మరి ఈ చిత్రం అయితే డైరెక్ట్ ఓటిటి లో రిలీజ్ కానున్నట్టుగా ఇప్పుడు ఫిక్స్ అయ్యింది. అయితే ఈ సినిమాని ‘ఈటీవీ విన్’ ఓటిటి యాప్ వారు స్ట్రీమింగ్ కి తీసుకురానున్నారు. అలాగే ఈ చిత్రం అయితే ఈ ఏప్రిల్ 5 నుంచి అధికారికంగా ఇందులో రిలీజ్ కానుంది.

సంబంధిత సమాచారం :