అందరూ తప్పక చూడాల్సిన చిత్రం “రైటర్ పద్మభూషణ్” – రవితేజ!

Published on Feb 8, 2023 2:35 am IST


టాలీవుడ్ యంగ్ యాక్టర్ సుహస్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ షణ్ముఖ ప్రశాంత్ దర్శకత్వం లో తెరకెక్కిన ఫ్యామిలి ఎంటర్టైనర్ రైటర్ పద్మభూషణ్. ఈ చిత్రం థియేటర్ల లో విడుదల అయ్యి సూపర్ పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ సినిమా పై ప్రశంసల వర్షం కురిపించగా, తాజాగా మాస్ మహారాజా రవితేజ సినిమా పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

సుహస్ పెర్ఫార్మెన్స్ సూపర్ అంటూ చెప్పుకొచ్చారు. రైటర్ పద్మభూషణ్ చిత్రం పూర్తిగా ఆనందించాను. క్లైమాక్స్ చిత్రానికి హార్ట్, చాలా బాగా నచ్చింది. అందరూ తప్పక చూడాల్సిన చిత్రం ఇది అంటూ చెప్పుకొచ్చారు. ఇలాంటి రిఫ్రెష్ చిత్రాన్ని తీసినందుకు చిత్ర యూనిట్ కి అభినందనలు తెలిపారు. మాస్ మహారాజా రవితేజ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

సంబంధిత సమాచారం :