రవితేజ కొత్త చిత్రం లాంచ్ ఆరోజే !

‘అమర్ అక్బర్ ఆంటొని’ చిత్రం తో హ్యాట్రిక్ పరాజయాలను ఖాతాలో వేసుకున్న స్టార్ హీరో రవితేజ తన కొత్త చిత్రానికి రెడీ అవుతున్నాడు. ‘ఎక్కడిపోతావు చిన్నవాడా’ ఫేమ్ వి ఐ ఆనంద్ దర్శకత్వంలో రవితేజ నటించనున్న కొత్త చిత్రం నవంబర్ 23న లాంచ్ కానుందని సమాచారం. అదే రోజు ఈచిత్రం యొక్క టైటిల్ లోగో ను కూడా విడుదల చేయనున్నారు. ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్ పతాకం ఫై ‘నేల టిక్కెట్టు’ నిర్మాత రవి తాళ్లూరి నిర్మించనున్న ఈ చిత్రంలో రవితేజ డ్యూయెల్ రోల్లో కనిపించనున్నారు.

తమన్ సంగీతం అందించనున్న ఈ చిత్రంలో నాబా నటేష్ , పాయల్ రాజ్ పుత్ హీరోయిన్లుగా నటించనున్నారు. మరో హీరోయిన్ ను ప్రకటించాల్సి వుంది. డిసెంబర్ నుండి ఈ చిత్రం యొక్క రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. ఇక ఈ సినిమా తోనైనా హిట్ కొట్టి రవితేజ సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడో లేదో చూడాలి.

Exit mobile version