మొత్తానికి ఓటీటీ డేట్ ఫిక్స్ చేసుకున్న మాస్ మహారాజ్ లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

Bhartha Mahasayulaku Wignyapthi

మాస్ మహారాజ రవితేజ హీరోగా ఆషికా రంగనాథ్ మరియు మరో బ్యూటీ డింపుల్ హయాతి కలయికలో దర్శకుడు కిషోర్ తిరుమల తెరకెక్కించిన లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రమే భర్త మహాశయులకు విజ్ఞప్తి. ఈ సంక్రాంతి కానుకగా వచ్చిన సినిమాల్లో ఇది కూడా ఒకటి. అయితే దీనితో వచ్చిన అన్ని సినిమాలు కూడా ఓటీటీలో ఆల్రెడీ వచ్చేసాయి. కానీ ఈ సినిమా మాత్రం రాలేదు.

అలా కొన్ని డేట్స్ తర్వాత ఫైనల్ గా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది. ఈ సినిమాని జీ 5 వారు సొంతం చేసుకోగా లేటెస్ట్ ఓ ప్రోమోతో వారు డేట్ ప్రకటించారు. ఈ మార్చ్ 13నుంచి ఓటీటీ లో అందుబాటులో ఉంటుంది అని కన్ఫర్మ్ చేశారు. సో అప్పుడు ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ని మిస్ అయితే ఇప్పుడు చూడవచ్చు. ఇక ఈ సినిమాకి భీమ్స్ సంగీతం అందించారు అలాగే ఎస్ ఎల్ వి సినిమాస్ వారు నిర్మాణం వహించారు.

Exit mobile version