లేటెస్ట్ : రవితేజ ‘ధమాకా’ ఫస్ట్ సాంగ్ రిలీజ్ డేట్, ఫిక్స్

Published on Aug 15, 2022 5:30 pm IST

ఇటీవల శరత్ మండవ తెరకెక్కించిన రామారావు ఆన్ డ్యూటీ మూవీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు మాస్ మహారాజ రవితేజ. యావరేజ్ విజయం అందుకున్న ఆ మూవీ అనంతరం త్వరలో ధమాకా ద్వారా ఆయన ప్రేక్షకుల ముందుకు రానున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ పిక్చర్స్ సంస్థల పై ఎంతో భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ మూవీని త్రినాధరావు నక్కిన తెరకెక్కిస్తున్నారు.

ఈ మూవీలో పెళ్లి సందడి ఫేమ్ శ్రీలీల రవితేజ కి జోడీగా నటిస్తుండగా యువ మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. ఇటీవల షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ధమాకా లో మాస్ మహారాజ రవితేజ క్యారెక్టర్ మంచి ఎంటర్టైనింగ్ గా ఆసక్తికరంగా ఉండనుందని, అలానే మూవీ కూడా యాక్షన్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా సాగుతూ అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకుంటుందని అంటోంది యూనిట్.

ఇక ఈ మూవీ నుండి జింతాక్ అనే పల్లవితో సాగే మాస్ బీట్ సాంగ్ ని ఆగష్టు 18న మధ్యాహ్నం 12 గం. 01 నిమిషాలకు రిలీజ్ చేస్తున్నట్లు కొద్దిసేపటి క్రితం ఆ సాంగ్ లోని ఒక పోస్టర్ ద్వారా యూనిట్ ప్రకటించింది. ఈ పోస్టర్ లో శ్రీలీలని రవితేజ ఎత్తుకున్న సీన్ ని చూడవచ్చు. అలానే ఆ పోస్టర్ లో రవితేజ, శ్రీలీల ల మాస్ ఎక్స్ ప్రెషన్స్ ని బట్టి ఈ సాంగ్ అదిరిపోయే రేంజ్ లో రూపొందినట్లు తెలుస్తోంది. డబుల్ ఇంపాక్ట్ అనే ట్యాగ్ లైన్ తో రానున్న ధమాకా రిలీజ్ డేట్ ని త్వరలో అనౌన్స్ చేయనున్నారు.

సంబంధిత సమాచారం :