రవితేజ ‘ధమాకా’ మాస్ మీట్ వెన్యూ,డేట్ ఫిక్స్

రవితేజ ‘ధమాకా’ మాస్ మీట్ వెన్యూ,డేట్ ఫిక్స్

Published on Dec 27, 2022 12:33 AM IST

మాస్ మహారాజా రవితేజ తో త్రినాధరావు నక్కిన తీసిన లేటెస్ట్ మాస్ బ్లాక్ బస్టర్ మూవీ ధమాకా. డబుల్ ఇంపాక్ట్ అనే ట్యాగ్ లైన్ తో రూపొందిన ఈ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంస్థలు కలిసి నిర్మించగా యువ అందాల నటి శ్రీలీల హీరోయిన్ గా నటించారు. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందించిన ఈ మూవీ ఫస్ట్ డే ఫస్ట్ షో నుండి సూపర్ హిట్ టాక్ తో భారీ కలెక్షన్స్ తో ప్రస్తుతం అన్ని ప్రాంతాల్లో దూసుకెళుతోంది.

ఈ మూవీ ద్వారా కొంత గ్యాప్ తరువాత కెరీర్ పరంగా మంచి బ్లాక్ బస్టర్ అందుకున్న రవితేజ ప్రస్తతం ఫుల్ జోష్ లో ఉన్నారు. అయితే విషయం ఏమిటంటే, తమకు ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ సక్సెస్ అందించిన ప్రేక్షకాభిమానులని కలుసుకునేందుకు ధమాకా మాస్ మీట్ పేరుతో ఒక సక్సెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఇప్పటికే ప్రకటించిన ధమాకా టీమ్, ఈ మాస్ మీట్ ని డిసెంబర్ 29 గురువారం సాయంత్రం 6 గం. ల నుండి హైదరాబాద్ లోని జెఆర్సీ కన్వేషన్ సెంటర్ లో గ్రాండ్ గా నిర్వహించనున్నట్లు కొద్దిసేపటి క్రితం అఫీషియల్ గా ప్రకటించారు. కాగా ఈ మాస్ మీట్ కి భారీ స్థాయిలో మాస్ మహారాజా ఫ్యాన్స్ హాజరు అయ్యేలా మేకర్స్ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు