మాస్ రాజా ‘ధమాకా’ సాంగ్ కి నాన్ స్టాప్ రెస్పాన్స్

మాస్ రాజా ‘ధమాకా’ సాంగ్ కి నాన్ స్టాప్ రెస్పాన్స్

Published on Dec 20, 2022 10:36 PM IST


మాస్ మహారాజా రవితేజ హీరోగా త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ధమాకా. డిసెంబర్ 23న క్రిస్మస్ సందర్భంగా రిలీజ్ కానున్న ఈ మూవీ పై రవితేజ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ అందరిలో భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంస్థలపై ఎంతో భారీ వ్యయంతో నిర్మితం అయిన ఈ మూవీ డబుల్ ఇంపాక్ట్ అనే ట్యాగ్ లైన్ తో రూపొందింది.

ఇక ఇటీవల ధమాకా నుండి రిలీజ్ అయిన సాంగ్స్, థియేట్రికల్ ట్రైలర్, టీజర్ అన్ని కూడా ఆడియన్స్ లో సూపర్ గా రెస్పాన్స్ సొంతం చేసుకుని మూవీ పై మరింతగా అంచనాలు పెంచేసాయి. అయితే విషయం ఏమిటంటే, మొదటగా ధమాకా మూవీ నుండి రిలీజ్ అయిన జింతాక్ సాంగ్ యూత్ తో పాటు మాస్ ఆడియన్స్ ని సైతం ఎంతో ఆకట్టుకుంది. అప్పటి నుండి యూట్యూబ్ లో విపరీతమైన వ్యూస్ తో దూసుకెళ్తున్న ఈ సాంగ్ నేటితో 43 మిలియన్ వ్యూస్ ని దక్కించుకుంది. ఆ విధంగా ఈ సాంగ్ అందరి నుండి నాన్ స్టాప్ గా రెస్పాన్స్ అందుకుని కొనసాగుతుండడంతో ధమాకా టీమ్ ఆనందం వ్యక్తం చేస్తోంది. కాగా శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీకి భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు