మాస్ మహారాజా ‘ధమాకా’ ట్రైలర్ రిలీజ్ టైం ఫిక్స్

మాస్ మహారాజా ‘ధమాకా’ ట్రైలర్ రిలీజ్ టైం ఫిక్స్

Published on Dec 13, 2022 9:23 PM IST


మాస్ మహారాజా రవితేజ లేటెస్ట్ మూవీ ధమాకా పై ఆయన ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ అందరిలో భారీ స్థాయి అంచనాలు ఉన్నాయి. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలపైన ఎంతో గ్రాండ్ లెవెల్లో నిర్మితం అయిన ఈ మూవీని త్రినాధరావు నక్కిన తెరకెక్కించగా శ్రీలీల హీరోయిన్ గా నటించింది. మరోవైపు ఇటీవల ఈ మూవీ నుండి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్స్, టీజర్, సాంగ్స్ అన్ని కూడా సూపర్ గా ఆడియన్స్ ని ఆకట్టుకుని మూవీ పై మరింతగా అంచనాలు ఏర్పరిచిన సంగతి తెలిసిందే.

ఇక ధమాకా మూవీ యొక్క థియేట్రికల్ ట్రైలర్ ని డిసెంబర్ 15న సాయంత్రం 6 గం. 45 ని. లకు రిలీజ్ చేస్తున్నట్లు కొద్దిసేపటి క్రితం మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించారు. కాగా ఈ యాక్షన్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీని డిసెంబర్ 23న భారీ స్థాయిలో రిలీజ్ చేయనున్నారు మేకర్స్. రవితేజ డయల్ రోల్ చేసిన ఈ మూవీకి భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు