రవితేజ మార్క్ యక్షన్, పవర్ఫుల్ స్టైల్ తో అదిరిపోయిన ‘ధమాకా’ ట్రైలర్

రవితేజ మార్క్ యక్షన్, పవర్ఫుల్ స్టైల్ తో అదిరిపోయిన ‘ధమాకా’ ట్రైలర్

Published on Dec 15, 2022 6:58 PM IST

మాస్ మహారాజా రవితేజ హీరోగా అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలపై త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ పక్కా కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ధమాకా. శ్రీలీల హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో రవితేజ డ్యూయల్ రోల్ చేయగా భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందించారు. ఇటీవల రిలీజ్ అయిన ఈ మూవీ యొక్క పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ఇలా అన్ని కూడా ఆడియన్స్ ని రవితేజ ఫ్యాన్స్ ని ఎంతో ఆకట్టుకుని ధమాకా మూవీ పై భారీ స్థాయి అంచనాలు ఏర్పరిచాయి.

ఇక నేడు కొద్దిసేపటి క్రితం ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్ ని రిలీజ్ చేసారు మేకర్స్. ఇక ట్రైలర్ లో మాస్ మహారాజా రవితేజ పవర్ఫుల్ డైలాగ్స్, మాస్ స్టైల్ యాక్షన్, మేనరిజమ్స్, ఫైట్స్ నిజంగా సూపర్ గా ఉన్నాయి. మావా బ్రో, మా అమ్మ పళ్ళు తెమ్మన్నది, నేను వెనుక ఉన్న వాళ్ళని చూసుకుని పైకి వచ్చిన వాడిని కాదు అంటూ రవితేజ పలికే పలు పవర్ఫుల్ డైలాగ్స్ బాగా అలరించాయి.

అలానే ట్రైలర్ లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో పాటు విజువల్స్ కూడా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా భారీ యాక్షన్ సీన్స్, ఫైట్స్ వంటివి కూడా అలరించడంతో మూవీ పై ఇప్పటివరకు ఫ్యాన్స్, ఆడియన్స్ లో అంచనాలు మరింతగా పెరగడం ఖాయం అనే చెప్పాలి. ఇక ప్రస్తుతం ధమాకా థియేట్రికల్ ట్రైలర్ కి యూట్యూబ్ లో సూపర్ గా రెస్పాన్స్ లభిస్తోంది. కాగా ఈ మూవీ తెలుగు సహా పలు భాషల్లో డిసెంబర్ 23న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు