‘ఇరుముడి’పై రవితేజ ఎమోషనల్ వర్డ్స్..!

మాస్ మహారాజా రవితేజ కెరీర్‌లో ‘ఇరుముడి’ చాలా ప్రత్యేకమైన చిత్రమని ఆయన స్వయంగా వెల్లడించారు. సాధారణంగా సినిమా విడుదల కాకముందే దాని గురించి ఎక్కువగా మాట్లాడని రవితేజ, కేవలం ప్రేక్షకుల స్పందనపైనే నమ్మకం ఉంచుతుంటారు. అయితే ‘ఇరుముడి’ విషయంలో మాత్రం ఆయన ఎంతో ఉత్సాహంగా కనిపిస్తున్నారు.

తాజాగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ఈ చిత్రాన్ని కుటుంబాలకు ఎమోషనల్‌గా అంకితం ఇచ్చారు. “ప్రతి తండ్రికి.. ప్రతి కూతురికి.. ప్రతి కుటుంబానికి ఇది నా అంకితం. నా హృదయానికి ఎంతో దగ్గరైన ఈ సినిమా మీ అందరికీ కూడా అంతే బాగా నచ్చుతుందని నమ్ముతున్నాను.. స్వామియే శరణం అయ్యప్ప” అంటూ రవితేజ ఎమోషనల్‌గా చెప్పుకొచ్చారు.

ఈ సినిమాలో ఆయన చేసిన పాత్రలోని నిజాయితీ, ఎమోషన్ ఆయన మాటల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఇందులో బేబీ నక్షత్ర ఆయన కూతురిగా నటించగా, ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా అలరించనుంది. దర్శకుడు శివ నిర్వాణ ఈ చిత్రాన్ని భావోద్వేగభరితమైన దృశ్యరూపంగా మలిచారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

Exit mobile version