ఆగిపోయిన టాప్ హీరో సినిమా !
Published on Oct 31, 2017 7:02 pm IST

తమిళ్ లో మంచి విజయం సాదించిన ‘బోగన్’ సినిమాలో జయం రవి, అరవింద్‌ స్వామి ప్రధాన పాత్రల్లో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాని తెలుగులో రీమేక్‌ చేయడానికి సన్నాహాలు చెయ్యబోతునట్లు వార్తలు వచ్చాయి. ఒరిజినల్ సినిమాకు దర్శకత్వం వహించిన లక్ష్మణ్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారని న్యూస్ వచ్చింది. జయం రవి పోషించిన పాత్రను ఇక్కడ రవితేజ పోషిస్తున్నారని, హన్సిక పాత్రకు కేథరిన్‌ను ఎంపిక చేశారని తెలిసింది.

తాజా సమాచారం మేరకు ఈ సినిమా ఆగిపోయిందని తెలుస్తుంది. తెలుగులో చుట్టాలబ్బాయి సినిమాకు నిర్మించిన నిర్మాతలు ఈ సినిమాను స్టార్ట్ చెయ్యలనుకున్నారు, కాని కొన్ని అనివార్య కారణాలవల్ల సినిమా ఆరంభంలోనే ఆటంకాలు వచ్చాయని టాక్. ప్రస్తుతం రవితేజ శ్రీనువైట్ల దర్శకత్వంలో ఒక సినిమా త్వరలో మొదలుపెట్టబోతున్నాడు.

 
Like us on Facebook