రవితేజ సినిమా వాయిదా పడిందా ?

‘రాజా ది గ్రేట్‌’ సినిమా తరువాత రవితేజ విక్ర‌మ్ సిరికొండ ద‌ర్శ‌క‌త్వంలో ‘ట‌చ్ చేసి చూడు’ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. రాశి ఖ‌న్నా, సీర‌త్ క‌పూర్ హీరోయిన్లుగా న‌టిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కి ప్రేక్షకుల ముందుకు రాబోతోందని ప్రచారం జరిగింది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ ఇంకా బ్యాలెన్స్ ఉండడంతో విడుదల తేది మారోచ్చని సమాచారం.

నల్లమలుపు బుజ్జి, వల్లభనేని వంశీలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో రవితేజ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు. రాశి ఈ సినిమాలో వెస్ట్రన్ డ్యాన్స్ టీచర్‌ పాత్రలో కనిపించనుంది. ప్రీతమ్ సంగీతాన్ని సమకూరుస్తున్న ఈ సినిమా రవితేజ కెరిర్ లో మంచి విజయం సాధిస్తుందని చిత్ర యూనిట్ నమ్మకంగా ఉంది.