‘పుష్ప’ రాజ్ అడవుల్లో రవితేజ సినిమా షూటింగ్.!

Published on Nov 7, 2021 7:05 pm IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరియు క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో “పుష్ప” అనే సాలిడ్ ఎంటర్టైనర్ తెరక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా బ్యాక్ డ్రాప్ అంతా కూడా పూర్తిగా అడవుల్లోని ఉంటుందని కూడా తెలిసిందే. అలా ఈ సినిమాలోని కీలక షెడ్యూల్ ని మారేడుమిల్లి అడవుల్లో కంప్లీట్ చేశారు.

మరి సరిగా ఇదే అడవుల్లో మాస్ మహారాజ్ హీరోగా నూతన దర్శకుడు శరత్ మందవ కాంబోలో చేస్తున్న సినిమా “రామారావు ఆన్ డ్యూటీ”. మంచి అంచనాలు నెలకొల్పుకున్నా ఈ చిత్రం కూడా పుష్ప షూట్ చేసుకున్న ఈ అడవుల్లోని జరుపుకుంటున్నట్టు తెలుస్తుంది.

ఇక్కడ కూడా ఒక థ్రిల్లింగ్ యాక్షన్ సీక్వెన్స్ నే మేకర్స్ షూట్ చేస్తున్నారట. మరి ఈ సినిమాలో మజిలీ ఫేమ్ దిగంగన సూర్యవంశీ హీరోయిన్ గా నటిస్తుండగా సుధాకర్ చెరుకూరి మరియు రవితేజా లు తమ బ్యానర్స్ పై నిర్మాణం నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :