మాస్ మహారాజా “రవితేజ” ఎంట్రీ అదుర్స్… ఈ సంక్రాంతికి పూనకాలే..!

మాస్ మహారాజా “రవితేజ” ఎంట్రీ అదుర్స్… ఈ సంక్రాంతికి పూనకాలే..!

Published on Dec 12, 2022 11:15 AM IST

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఔట్ అండ్ ఔట్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ వాల్తేరు వీరయ్య. ఈ చిత్రం లో మాస్ మహారాజా రవితేజ ఒక పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. రవితేజ కి సంబంధించిన అప్డేట్ కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే నేడు చిత్ర యూనిట్ అందుకు సంబంధించిన ఒక చిన్న వీడియో ను రిలీజ్ చేయడం జరిగింది.

ఈ వీడియో లో మాస్ మహారాజా రవితేజ నట విశ్వరూపం ను చూడవచ్చు. డైరెక్టర్ బాబీ రవితేజ పాత్రను ఈ చిత్రం లో చాలా పవర్ ఫుల్ గా తీర్చ దిద్దినట్లు ఉంది. ఫస్ట్ టైం ఒక మేకపిల్ల ను పులి ఎత్తుకొని వస్తున్నట్లు ఉన్నాది అనే డైలాగ్ తో రవితేజ ను పవర్ ఫుల్ గా చూపించారు. వీడియో లోని రవితేజ మాస్ డైలాగ్స్ కి రాక్ స్టార్ డిఎస్పీ దేవీ శ్రీ ప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సూపర్ గా ఉంది. ఇప్పటికే ఈ చిత్రం కి సంబంధించిన ప్రచార చిత్రాలు, వీడియోలు సినిమా పై భారీ అంచనాలను పెంచేశాయి. ఈ చిత్రం ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 13, 2022 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో విడుదల కాబోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు