రెండు సినిమాలు మొదలు పెట్టబోతున్న స్టార్ హీరో !

24th, October 2017 - 04:43:29 PM

రవితేజ కథానాయకుడిగా ప్రస్తుతం ‘టచ్ చేసి చూడు’ సినిమా షూటింగ్ జరుగుతోంది, ఈ సినిమాను డిసెంబర్ లో పూర్తిచేసి జనవరిలో విడుదల చేసే ఆలోచనలో ఉన్నాడు రవితేజ. ఇది కాకుండా ఇంకో రెండు కొత్త చిత్రాల్ని మొదలుపెట్టనున్నారాయన. వాటిలో ఒకటి ‘భోగన్’ రీమేక్ కాగా మరొకటి స్ట్రయిట్ సినిమా.

ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ‘చుట్టాలబ్బాయి’ చిత్ర నిర్మాతలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దర్శకుడు పవన్ సాదినేని మాటలు అందిస్తున్నారు. అలాగే శ్రీనువైట్ల దర్శకత్వంలో బండ్ల గణేష్ నిర్మాతగా మరో సినిమా ఉండబోతుంది. ఈ రెండు సినిమాల్లో రవితేజ మొదటగా ‘బోగన్’ రీమేక్ చేస్తాడని సమాచారం.