తన మార్క్ స్వాగ్ తో “మిస్టర్ బచ్చన్” నుంచి రవితేజ..

తన మార్క్ స్వాగ్ తో “మిస్టర్ బచ్చన్” నుంచి రవితేజ..

Published on Jan 26, 2024 11:58 AM IST

మాస్ మహారాజ రవితేజ బర్త్ డే నేడే కావడంతో అభిమానులు అయితే ఈ స్పెషల్ డే ని మరింత స్పెషల్ గా సెలెబ్రేట్ చేసుకుంటూ ఉండగా తన సినిమాల నుంచి కూడా మేకర్స్ సాలిడ్ అప్డేట్ లని అందిస్తున్నారు. అయితే అలా తాను ఇప్పుడు నటిస్తున్న చిత్రాల్లో తన హిట్ దర్శకుడు హరీష్ శంకర్ తో చేస్తున్న సాలిడ్ యాక్షన్ డ్రామా “మిస్టర్ బచ్చన్” కూడా ఒకటి కాగా ఈ చిత్రం నుంచి రవితేజ బర్త్ డే కానుకగా స్పెషల్ పోస్టర్ ని లాంచ్ చేశారు.

మరి ఫస్ట్ లుక్ లో సూపర్ కూల్ రవితేజని ప్రెజెంట్ చేస్తే ఈసారి మాత్రం మాస్ మహారాజ్ లోని తన మార్క్ మాస్ స్వాగ్ తో పోస్టర్ దింపారు అని చెప్పాలి. మరి ఈ పోస్టర్ తో అయితే ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఇక ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తుండగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు అలాగే బాలీవుడ్ నిర్మాణ సంస్థ టి సిరీస్ కలయికలో నిర్మాణం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూట్ శరవేగంగా కంప్లీట్ అవుతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు