రవితేజ కొత్త సినిమాకు ముహూర్తం ఖరారు !

10th, January 2018 - 05:08:32 PM

రవితేజ ‘రాజా ది గ్రేట్’ సినిమా తరువాత విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో వస్తోన్న ‘టచ్ చేసి చూడు’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాతో పాటు కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ‘నేల టికెట్’ అనే సినిమా చేస్తున్నాడు ఈ హీరో. ‘టచ్ చేసి చూడు’ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. ఈ మూవీని ఫిబ్రవరి 2న విడుదల చెయ్యబోతున్నారు. ఈ సినిమాలో, రాశిఖన్నా, శీరత్ కపూర్ హీరోయిన్స్ గా నటించారు.

తాజాగా రవితేజ శ్రీను వైట్లతో సినిమా చెయ్యబోతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించబోతున్నాడు. మార్చి నుండి ఈ సినిమా మొదలు కాబోతోంది. రవితేజ ఎన్ఆర్ఐ గా కనిపించబోతున్న ఈ సినిమా చిత్రీకరణ ఎక్కువ భాగం అమెరికాలో జరగబోతోంది.