మాస్ మహారాజా ఫ్యాన్స్ కి అదిరిపోయే పండగ ట్రీట్…!

raviteja

మాస్ మేనరిజం, డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ తో స్టార్ హీరోలలో ఒకరిగా ఎదిగిన రవితేజ నేడు దీపావళి కానుకగా ఫ్యాన్స్ కి పండుగ గిఫ్ట్ సిద్ధం చేశారు. పండుగను పురస్కరించుకొని రవితేజ తాను చేయనున్న కొత్త సినిమా సంగతులు చెప్పనున్నారు. మధ్యాహ్నం రెండు గంటలకు రవి తేజా కొత్త సినిమాకి సంబందించిన దర్శకుడు, నిర్మాత నటీనటులు వంటి విషయాలు వెల్లడించనున్నారు. మరి రవి తేజ త్వరలో మొదలుపెట్టనున్న ఆ క్రేజీ ప్రాజెక్ట్ ఏమిటో ఇంకొద్ది గంటలలో తెలిసిపోనుంది.

ఇక రవితేజా ప్రస్తుతం వి ఐ ఆనంద్ దర్శకత్వంలో డిస్కో రాజా మూవీ చేస్తున్నారు. ఓ వైవిధ్యమైన కాన్సెప్ట్ తో సైన్స్ ఫిక్షన్ మూవీగా రానున్న ఈ మూవీలోని రవి తేజా లుక్ ని కొద్దిరోజుల క్రితం విడుదల చేశారు. 80-90ల కాలం నాటి డాన్ గెటప్ లో ఉన్న రవితేజ అందరిని ఆకర్షించారు. పాయల్ రాజ్ పుత్, నభా నటేష్ రవితేజ కి జంటగా నటిస్తుండగా మ్యూజిక్ సెన్సేషన్ ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. డిస్కో రాజా చిత్రాన్ని దీపావళి కానుకగా డిసెంబర్ 20న విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.

Exit mobile version