రవితేజ కొత్త సినిమా షూటింగ్ ప్రారంభం !

సోగ్గాడే చిన్ని నాయనా, రారండోయ్ వేడుక చూద్దాం సినిమాలతో మంచి విజయాలు అందుకున్న డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ తదుపరి సినిమా రవితేజ తో చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఈరోజు ప్రారంభం అయ్యింది. మాళవిక శర్మ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.

నేల టికెట్ అనే మాస్ టైటిల్ ఈ సినిమాకు పెట్టడం జరిగిందని సమాచారం. ఫిదా సినిమాకు సంగీతం అందించిన శక్తీ కాంత్ ఈ సినిమాకు స్వరాలు సమకూరుస్తున్నాడు. చోటా కె ప్రసాద్ ఎడిటర్ గా పనిచేస్తున్న ఈ సినిమాతో రవితేజ మరో విజయం తన ఖాతాలో వేసుకుంటాడని ఆశిద్దాం. రవితేజ తాజా సినిమా టచ్ చేసి చూడు ఈనెలలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.