“ఖిలాడీ” ప్రమోషన్స్‌పై దృష్టిపెట్టని రవితేజ.. కారణం అదేనా?

Published on Feb 8, 2022 12:00 am IST

మాస్ మహారాజ్ రవితేజ హీరోగా, డింపుల్ హయతి, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా, రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన మాస్ యాక్షన్ థ్రిల్లర్ “ఖిలాడీ”. పెన్ స్టూడియోస్ మరియు ఏ స్టూడియోస్ పతాకాలపై సత్యనారాయణ కోనేరు మరియు రమేష్ వర్మలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 11, 2022న విడుదల కాబోతుంది. అయితే ఈ సినిమా విడుదలకు రోజులు దగ్గరపడుతున్నా కూడా చిత్రబృందం మాత్రం ప్రమోషన్ల విషయంలో సైలెంట్‌గానే ఉంటుంది.

ఇక ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలపై రవితేజ కూడా పెద్దగా ఫోకస్ చేయడం లేదు. ప్రస్తుతం వరుస సినిమా షూటింగులతో రవితేజ బిజీగా ఉండటం వల్ల ఈ చిత్ర ప్రమోషన్స్‌పై దృష్టి పెట్టలేకపోతున్నాడట. దీంతో చిత్ర బృందం కూడా ప్రమోషన్స్ విషయంలో సైలెంట్‌గానే ఉంటున్నట్టు తెలుస్తుంది. ఇకపోతే కొన్నాళ్లుగా వరుస డిజాస్టర్లను అందుకుంటూ వస్తున్న రవితేజ గత ఏడాది “క్రాక్” సినిమాతో మంచి హిట్‌ని అందుకున్నాడు. ఇప్పుడు రాబోతున్న “ఖిలాడీ” సినిమాపై కూడా మంచి అంచనాలు ఉన్నాయి.

సంబంధిత సమాచారం :