‘కార్తికేయ – 2’ మూవీ పై మాస్ రాజా ప్రశంసలు

Published on Aug 14, 2022 1:00 am IST

యువ నటుడు నిఖిల్ సిద్దార్ధ లేటెస్ట్ మూవీ కార్తికేయ – 2 నిన్న భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. యాక్షన్ అడ్వెంచరస్ సస్పెన్స్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీకి కాలభైరవ మ్యూజిక్ అందించారు. చందూ మొండేటి తీసిన ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించగా టిజి విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ దీనిని నిర్మించారు. కాగా తమ మూవీ అన్ని ప్రాంతాల ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ అందుకోవడంతో నేడు సక్సెస్ మీట్ ఏర్పాటు చేసిన యూనిట్, ప్రత్యేకంగా అందరికీ ధన్యవాదాలు తెలిపింది.

ఇక ఈ మూవీకి పాజిటివ్ మౌత్ టాక్ రావడంతో పాటు రివ్యూస్ కూడా ఎంతో బాగుండడం ఆనందాయకం అన్నారు హీరో నిఖిల్. కాగా కొద్దిసేపటి క్రితం టాలీవుడ్ మాస్ మహారాజ రవితేజ కార్తికేయ – 2 మూవీ పై ప్రశంసలు కురిపిస్తూ ఒక పోస్ట్ చేసారు. ఇంతటి అద్భుతమైన మూవీని తెరక్కించి ఆడియన్స్ అందరి మెప్పు పొంది సూపర్ హిట్ కొట్టిన కార్తికేయ 2 టీమ్ కి నా తరపున ప్రత్యేక అభినందలు అంటూ రవితేజ పోస్ట్ చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.

సంబంధిత సమాచారం :