‘సీతారామం’ మూవీ పై మాస్ రాజా ప్రసంసలు

‘సీతారామం’ మూవీ పై మాస్ రాజా ప్రసంసలు

Published on Aug 7, 2022 12:07 AM IST


వైజయంతి మూవీస్ బ్యానర్ పై హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ సీతారామం. విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ అందించిన ఈ మూవీలో రష్మిక మందన్న ఒక ముఖ్య పాత్ర చేయగా మురళి శర్మ, తరుణ్ భాస్కర్, భూమిక, సుమంత్ ఇతర పాత్రల్లో కనిపించారు .మొదటి నుండి అందరిలో భారీ అంచనాలు ఏర్పరిచిన సీతారామం మూవీ నిన్న విడుదలై మంచి సక్సెస్ టాక్ ని సొంతం చేసుకుంది. అటు ప్రేక్షకాభిమానులు మాత్రమే కాదు పలువురు సినిమా ప్రముఖులు సైతం ఈ మూవీ పై మంచి పొగడ్తలు కురిపిస్తున్నారు.

ఇక ఈ మూవీ నేడు వీక్షించిన మాస్ మహారాజ రవితేజ కొద్దిసేపటి క్రితం తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా తన స్పందనని తెలియచేసారు. ఇప్పుడే సీతారామం మూవీ చూసాను, ఎంతో అద్భుతంగా ఉంది, హీరో దుల్కర్, హీరోయిన్ మృణాల్, ముఖ్య పాత్ర చేసిన రష్మిక ఇలా ప్రతి ఒక్కరు ఎంతో బాగా నటించారు. అలానే దర్శకుడు నిర్మాత సహా ఈ మూవీ సక్సెస్ పై టీమ్ అందరికీ నా ప్రత్యేక అభినందనలు. ఇటువంటి మంచి క్లాసికల్ మూవీని అందరూ తప్పకుండా మూవీ థియేటర్స్ లో చూసి ఆనందించండి అంటూ రవితేజ తన పోస్ట్ లో తెలిపారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు