అంచనాలు పెంచేస్తున్న ‘రామారావు ఆన్ డ్యూటీ’ పోస్ట్ ప్రొడక్షన్ మేకింగ్ వీడియో…!!

Published on Jul 25, 2022 7:00 pm IST

టాలీవుడ్ స్టార్ యాక్టర్ మాస్ మహారాజా రవితేజ హీరోగా శరత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ రామారావు ఆన్ డ్యూటీ. రవితేజ ఎమ్మార్వో పాత్ర చేస్తున్న ఈ మూవీలో ఆయనకు జోడీగా రజీషా విజయన్, దివ్యాంశ కౌశిక్ హీరోయిన్స్ గా నటిస్తుండగా సామ్ సి మ్యూజిక్ అందించారు. శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్, రవితేజ టీమ్ వర్క్స్ బ్యానర్ పై భారీ స్థాయిలో తెరకెక్కిన ఈ మూవీ సాంగ్స్, ట్రైలర్, టీజర్ ఆడియన్స్ ని ఎంతో ఆకట్టుకుని మూవీపై భారీ అంచనాలు ఏర్పరిచాయి.

ఇక ఈ నెల 29న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానున్న రామారావు ఆన్ డ్యూటీ మూవీకి సంబంధించి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మేకింగ్ వీడియోని యూనిట్ రిలీజ్ చేసింది. దర్శకుడు శరత్ మండవ, ఎడిటర్ ప్రవీణ్, మ్యూజిక్ డైరెక్టర్ సామ్ సి, సౌండ్ ఇంజినీర్స్ సహా యూనిట్ మొత్తం మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కోసం కష్టపడుతున్న విజువల్స్ అందులో చూడవచ్చు. వీడియో చూసిన పలువురు ఆడియన్స్ మూవీ కోసం ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. మొత్తంగా ఈ వీడియో తో మూవీ పై మరింతగా అంచనాలు ఏర్పడ్డాయి. వేణు తొట్టెంపూడి ఒక కీలక రోల్ చేస్తున్న ఈ మూవీలో నాజర్, నరేష్, రాహుల్ రామకృష్ణ, పవిత్ర లోకేష్, జాన్ విజయ్ తదితరులు ఇతర రోల్స్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :