“రావణాసుర” గా అదిరే ఫస్ట్ లుక్ తో మాస్ మహారాజ్.!

Published on Nov 5, 2021 10:43 am IST


మాస్ మహారాజ రవితేజ స్పీడ్ ఇప్పుడు టాలీవుడ్ లో మరో లెవెల్లో ఉందని చెప్పాలి. క్రాక్ సాలిడ్ కం బ్యాక్ తో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు లైన్ లో పెట్టేసి జెట్ స్పీడ్ తో ఆ సినిమాలు కంప్లీట్ చేస్తున్నాడు మాస్ మహారాజ్. మరి మొన్ననే తన మొట్ట మొదటి పాన్ ఇండియన్ సినిమా అనౌన్స్ చేసిన రవితేజ దానికి ముందే దర్శకుడు సుధీర్ కె వర్మతో ఓ ఇంట్రెస్టింగ్ సినిమాని కూడా అనౌన్స్ చేశారు.

మరి ఇప్పుడు దాని తాలూకా ఫస్ట్ లుక్ పోస్టర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేశారు. అప్పుడు అనౌన్స్మెంట్ పోస్టర్ తో ఆసక్తి రేపిన చిత్ర యూనిట్ ఇప్పుడు మైండ్ బ్లోయింగ్ ఫస్ట్ లుక్ పోస్టర్, టైటిల్ ని రివీల్ చేసారు. భూతాలు అందరికీ దేవుడు అంటూ రవితేజ ని “రావణాసుర” గా పరిచయం చేశారు.

ఒక భారీ కపాలం పై కూర్చొని రవితేజ సూట్ లో ఒక సుత్తి లాంటిది పట్టుకొని దానికి రక్తం, బ్యాక్గ్రౌండ్ లో రవితేజ 9 తలలు మొత్తం ఓ రేంజ్ లో దీనిని సెట్ చేశారు. దీనిని బట్టి సినిమా కూడా కంప్లీట్ డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఉండబోతుంది అని క్లియర్ అవుతుంది. ఇక ఈ భారీ సినిమాని అభిషేక్ అగర్వాల్ రవితేజాలు తమ బ్యానర్స్ లో నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :