ఇంట్రెస్టింగ్ గా మాస్ మహారాజ్ “ఈగల్” క్రియేటివ్ పోస్టర్.!

Published on Nov 12, 2023 2:00 pm IST

మాస్ మహారాజ రవితేజ హీరోగా రీసెంట్ గా నటించిన చిత్రం “టైగర్ నాగేశ్వరరావు” తో ఈ ఏడాదిలో తన మూడో సినిమాతో తాను పలకరించగా ఇక ఈ చిత్రం తర్వాత తాను చేస్తున్న మరో భారీ యాక్షన్ సబ్జెక్టు “ఈగల్” తో అయితే వచ్చే ఏడాది స్టార్టింగ్ లోనే మళ్ళీ తాను ఆడియెన్స్ ని పలకరించేందుకు వస్తున్నాడు.

ఇక ఈ భారీ చిత్రంని దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కిస్తుండగా ఈ చిత్రం నుంచి రీసెంట్ గా వచ్చిన టీజర్ అయితే ఎవరూ ఊహించని విధంగా అంచనాలు పెంచేసింది. అలాగే ఇప్పుడు దీపావళి కానుకగా రిలీజ్ చేసిన నయా పోస్టర్ అయితే అందరికీ మరింత ఆసక్తి రేపింది అని చెప్పాలి.

మరి ఇందులో గన్ పట్టుకొని రవితేజ గాల్లో ఎగురుతున్నట్టుగా కనిపిస్తుండగా దానికి సినిమా ఎడిటర్ తన క్రియేటివిటీ జోడించి సూపర్ స్పెషల్ గా అయితే మార్చేశాడు. రవితేజకి వెపన్స్ తో రెక్కలు వచ్చి ఎగిరితే ఎలా ఉంటుందో చూపించాడు. దీనితో సినిమా టైటిల్ కి తగ్గట్టుగా ఈ ఇంట్రెస్టింగ్ పోస్టర్ అదిరిపోయింది. మరి సినిమా కూడా ఈ లెవెల్లో ఉంటే రవితేజ కి మరో మంచి హిట్ దక్కుతుంది అని చెప్పాలి.

సంబంధిత సమాచారం :