ఓ స్పెషల్, ఎనర్జిటిక్ సాంగ్ షూట్ లో “ఖిలాడి”.!

Published on Oct 22, 2021 3:33 pm IST

మాస్ మహారాజ రవితేజ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ లలో దర్శకుడు రమేష్ వర్మ తో ప్లాన్ చేసిన భారీ యాక్షన్ థ్రిల్లర్ సినిమా “ఖిలాడి” కూడా ఒకటి. ఎప్పుడో స్టార్ట్ అయ్యి రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం ఇప్పుడు ఫైనల్ షూటింగ్ లో ఉంది.

ఇక ఇదిలా ఉండగా ఈ సినిమాపై లేటెస్ట్ అప్డేట్ బయటకి వచ్చింది. ఈ సినిమాలో దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన ఓ స్పెషల్ ఎనర్జిటిక్ నెంబర్ షూట్ ఇప్పుడు దుబాయ్ లో జరుగుతున్నట్టు కన్ఫర్మ్ అయ్యింది. అంతే కాకుండా ఈ సాంగ్ ని యంగ్ అండ్ టాలెంటెడ్ కొరియోగ్రాఫర్ యష్ మాస్టర్ కంపోజ్ చేస్తున్నాడట.

సో విజువల్ గా ఈ సాంగ్ సినిమాలో చాలా స్పెషల్ గా కనిపించనుంది అని అర్ధం అవుతుంది. ఇక ఈ చిత్రంలో రవితేజ డ్యూయల్ రోల్ లో నటిస్తుండగా డింపుల్ హయాతి అలాగే మీనాక్షి చౌదరిలు హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం :