‘మిస్ట‌ర్ బ‌చ్చ‌న్’ నుండి సాలిడ్ అప్డేట్.. మ్యూజిక్ ఫెస్టివ‌ల్ స్టార్ట్!

‘మిస్ట‌ర్ బ‌చ్చ‌న్’ నుండి సాలిడ్ అప్డేట్.. మ్యూజిక్ ఫెస్టివ‌ల్ స్టార్ట్!

Published on Jul 4, 2024 6:42 PM IST

మాస్ రాజా ర‌వితేజ న‌టిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మిస్ట‌ర్ బ‌చ్చన్’ ఇప్ప‌టికే శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. ఈ సినిమాను ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్ తెర‌కెక్కిస్తుండ‌టంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

కాగా, ఈ సినిమా నుండి మేక‌ర్స్ తాజాగా ఓ అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమాలోని ఫ‌స్ట్ సింగిల్ సాంగ్ అనౌన్స్ మెంట్ ను త్వ‌ర‌లోనే చేయ‌బోతున్న‌ట్లు మేక‌ర్స్ తెలిపారు. మిస్ట‌ర్ బచ్చ‌న్ మ్యూజికల్ ఫెస్టివ‌ల్ మొద‌లైంద‌ని ఓ రొమాంటిక్ సాంగ్ లోని ట్యూన్ తో మేక‌ర్స్ తాజాగా అనౌన్స్ చేశారు. ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ అప్డేట్ తో మిస్ట‌ర్ బ‌చ్చ‌న్ పాట‌లు ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతాయా అని అభిమానులు ఆస‌క్తిగా చూస్తున్నారు.

ఇక ఈ సినిమాలో భాగ్య‌శ్రీ బొర్సె హీరోయిన్ గా న‌టిస్తోండ‌గా, జ‌గ‌ప‌తి బాబు విల‌న్ పాత్ర‌లో నటిస్తున్నాడు. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టిజి.విశ్వ‌ప్ర‌సాద్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు