హరీష్ శంకర్ సినిమా పై మరో క్రేజీ రూమర్ !

హరీష్ శంకర్ సినిమా పై మరో క్రేజీ రూమర్ !

Published on Oct 23, 2022 9:06 PM IST

డైరెక్టర్ హరీష్ శంకర్ రవితేజతో ఓ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. రవితేజకి హరీష్ శంకర్ ఓ కథ చెప్పాడని, రవితేజ గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చాడని రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి ఈ రూమర్స్ లో వాస్తవం ఎంత ఉందనేది ఇంకా క్లారిటీ లేదు. కాకపోతే, ఈ సినిమాని బండ్ల గణేశ్ నిర్మిస్తున్నారని, ఇది ఒక కమర్షియల్ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది.

మరి రవితేజ ఇమేజ్ కోసం హరీష్ శంకర్ ఎలాంటి కథ రాశాడో చూడాలి. అన్నట్టు హరీష్ శంకర్ ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేయడానికి స్క్రిప్ట్ పై కసరత్తులు చేస్తున్నాడు. మరీ ఈ సినిమా అయిపోయాక, తన తర్వాత సినిమాని హరీష్ శంకర్, రవితేజ తో చేస్తాడేమో చూడాలి. ఏది ఏమైనా హరీష్ శంకర్ సినిమా పై రోజుకొక రూమర్ వినిపిస్తుంది. ఇక ప్రస్తుతానికి రవితేజ ధమాకా, రావణాసుర , టైగర్ నాగేశ్వరరావు సినిమాలు చేస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు