రవితేజ తో మళ్లీ ప్లాన్ చేస్తున్నాడా ?

రవితేజ తో మళ్లీ ప్లాన్ చేస్తున్నాడా ?

Published on Dec 5, 2022 11:47 AM IST

డైరెక్టర్ సంపత్ నంది వచ్చే ఏడాది రవితేజ తో ఓ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. రీసెంట్ గా రవితేజ కి సంపత్ నంది ఓ కథ చెప్పాడని, రవితేజ్ గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చాడని రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి ఈ రూమర్స్ లో వాస్తవం ఎంత ఉందనేది ఇంకా క్లారిటీ లేదు. కాకపోతే, నిర్మాత నిరంజన్ రెడ్డి, రవితేజ హీరోగా ఒక సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నారట.

పైగా డైరెక్టర్ సంపత్ నంది – రవితేజ కలయికలో ఇప్పటికే బెంగాల్ టైగర్ అనే సినిమా వచ్చి హిట్ అయింది. మరి రవితేజ ఇమేజ్ కోసం సంపత్ నంది ఈ సారి ఎలాంటి కథ రాశాడో చూడాలి. నిజానికి, ఇదే కథతో సంపత్ నంది గోపీచంద్ తో సినిమా చేయబోతున్నట్లు ఆ మధ్య వార్తలు వచ్చాయి. అయితే, రవితేజ అయితేనే తాను రాసుకున్న కథకు పూర్తి న్యాయం జరుగుతుందని సంపత్ నంది ఫీల్ అయ్యాడట. అందుకే.. రవితేజతో సినిమా స్టార్ట్ చేయబోతున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు