రవితేజ “విక్రమార్కుడు” సీక్వెల్ ఉన్నట్టా? లేనట్టా?

Published on Sep 21, 2021 6:57 am IST


మాస్ మహారాజా రవితేజ హీరోగా, దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన “విక్రమార్కుడు” సినిమా 2006లో విడుదలై ఘన విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రవితేజ డ్యూయెల్ రోల్ చేశాడు. తనదైన మార్క్ కామెడీ, డైలాగ్ డెలివరీ, యాక్షన్ ఎపిసోడ్స్‌తో రవితేజ రెచ్చిపోగా, అనుష్క గ్లామర్‌తో పిచ్చెక్కించింది. అయితే ఇన్నేళ్ల తర్వాత ఈ చిత్రానికి సీక్వెల్ రాబోతోందంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

అంతేకాదు రచయిత విజయేంద్ర ప్రసాద్ ఇప్పటికే సీక్వెల్‌కి కథని సిద్ధం చేశారని, రాజమౌళి డైరెక్ట్ చేయడం కుదరకపోవడంతో వేరే దర్శకుడికి ఇస్తున్నాడని, బడా బ్యానర్‌పై ఈ సినిమాని నిర్మించబోతున్నారన్న ప్రచారం జరుగుతుంది. అయితే ఇందులో ఎంతమాత్రం వాస్తవం లేదనేది తాజాగా వినిపిస్తున్న టాక్. సీక్వెల్ సినిమాలను చేసేందుకు ప్రస్తుతానికి రవితేజ ఆసక్తిగా లేడని ఆయన సన్నిహితుల నుంచి వినిపిస్తున్న మాట. అసలు ఈ సీక్వెల్ ఉంటుందా లేదా అనేది మరికొద్ది రోజులు ఆగితే కానీ ఏమీ చెప్పలేం.

సంబంధిత సమాచారం :