హైదరాబాద్‌లో ప్రారంభమైన రవితేజ “ధమాకా” పవర్ ప్యాక్డ్ యాక్షన్ షెడ్యూల్!

హైదరాబాద్‌లో ప్రారంభమైన రవితేజ “ధమాకా” పవర్ ప్యాక్డ్ యాక్షన్ షెడ్యూల్!

Published on Feb 25, 2022 10:00 PM IST

మాస్ మహారాజా రవితేజ హీరోగా త్రినాధ రావు నక్కిన దర్శకత్వం లో ఔట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కుతున్న తాజా చిత్రం ధమాకా. ఇది డబుల్ ఇంపాక్ట్ అనే ఆసక్తికరమైన ట్యాగ్‌లైన్‌తో వస్తుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మరియు అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌ల నుండి వివేక్ కూచిభొట్ల ఈ చిత్రానికి సహ నిర్మాతగా ఉండగా, నిర్మాత టిజి విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ధమాకా కొత్త యాక్షన్ షెడ్యూల్ ఈరోజు హైదరాబాద్‌ లో ప్రారంభమైంది. రవితేజ మరియు ఫైటర్స్‌పై వేసిన భారీ సెట్‌లో టీమ్ ఉత్కంఠభరితమైన యాక్షన్ సీక్వెన్స్‌ను రూపొందిస్తోంది. ఈ ఎపిసోడ్‌ని రామ్ లక్ష్మణ్ మాస్టర్లు పర్యవేక్షిస్తున్నారు.

ఈ ఎపిసోడ్ గురించి నిర్మాత టిజి విశ్వ ప్రసాద్ మాట్లాడుతూ, “ఇది హై ఆక్టేన్ యాక్షన్ బ్లాక్, ఇది చిత్రానికి చాలా కీలకం. అందుకే బడ్జెట్‌లో ఎక్కడా రాజీ పడకుండా భారీ సెట్‌ వేశారు. మాస్‌కి, యాక్షన్‌ సినిమాల అభిమానులకు ఇది ఫీస్ట్‌ అవుతుంది” అని అన్నారు.

పెళ్లి సందడి చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న నటి శ్రీలీల ఈ చిత్రంలో రవితేజ సరసన కథానాయికగా నటిస్తోంది. ప్రసన్న కుమార్ బెజవాడ ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే మరియు సంభాషణలు అందించగా, భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూరుస్తుండగా, కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు