మాస్ మహారాజా రవితేజ ఔట్ అండ్ ఔట్ ఎంటర్ టైనర్ గా “ఖిలాడి” ట్రైలర్

Published on Feb 7, 2022 6:25 pm IST


రవితేజ హీరోగా, మీనాక్షి చౌదరీ, డింపుల్ హాయాతీ లు హీరోయిన్స్ గా నటిస్తున్న తాజా చిత్రం ఖిలాడి. ఈ చిత్రం లో రవితేజ డ్యూయల్ రోల్ లో నటిస్తున్నారు. పెన్ స్టూడియోస్ మరియు ఏ స్టూడియోస్ పతాకాల పై ఈ చిత్రాన్ని సత్యనారాయణ కోనేరు మరియు రమేష్ వర్మ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రమేష్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు, వీడియో లు, పాటలు ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి

తాజాగా ఈ చిత్రం నుండి ట్రైలర్ ను చిత్ర యూనిట్ విడుదల చేయడం జరిగింది. మాస్ మహారాజా రవితేజ మరొకసారి తన మాస్ విశ్వరూపం చూపించారు. పవర్ ఫుల్ డైలాగ్స్ తో పాటుగా ఈ చిత్రం ఔట్ అండ్ ఔట్ ఎంటర్ టైనర్ గా నిలుస్తుంది అనడం లో ఎలాంటి సందేహం లేదు. అర్జున్ సర్జా, ఉన్ని ముకుందన్, అనసూయ భరద్వాజ్, ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్న వారు అందరూ ట్రైలర్ లో తమ రోల్ పై క్లారిటీ ఇచ్చారు. మరోసారి రవితేజ ఈ ట్రైలర్ తో తన మాస్ ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చారు. ఫిబ్రవరి 11, 2022 న విడుదల కానున్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :