వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కి రవితేజ “ఖిలాడి” రెడీ!

Published on May 22, 2022 8:18 pm IST

మాస్ మహారాజా రవితేజ హీరోగా, రమేష్ వర్మ దర్శకత్వం లో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ ఖిలాడి. పెన్ స్టూడియోస్ మరియు ఏ స్టూడియోస్ పతాకాల పై ఈ చిత్రాన్ని సత్యనారాయణ కోనేరు మరియు రమేష్ వర్మ లు సంయుక్తంగా నిర్మించడం జరిగింది. మీనాక్షి చౌదరి, డింపుల్ హాయాతీ లేడీ లీడ్ రోల్స్ లో నటించగా, అర్జున్ సర్జా, ఉన్ని ముకుందన్ లు కీలక పాత్రల్లో నటించారు.

ఈ చిత్రం థియేటర్ల లో విడుదల అయ్యి, మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది. అంతేకాక బాక్సాఫీస్ వద్ద వసూళ్లను రాబట్టడం లో విఫలం అయ్యింది. ఇప్పుడు ఈ చిత్రం వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లితెర ప్రేక్షకులను అలరించడానికి సిద్దం అవుతుంది. వచ్చే ఆదివారం సాయంత్రం 6 గంటలకు స్టార్ మా లో ఈ చిత్రం ప్రసారం కానుంది. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రం బుల్లితెర పై ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం :