జనవరిలో ప్రారంభం కానున్న రవితేజ కొత్త సినిమా !
Published on Dec 4, 2017 1:09 pm IST

‘సోగ్గాడే చిన్ని నాయనా, రారండోయ్ వేడుక చూద్దాం’ సినిమాలతో మంచి విజయాలందుకున్న దర్శకుడు కళ్యాణ్ కృష్ణ ఈ మద్య రవితేజను కలిసి కథ వినిపించడం జరిగింది. కథ బాగా నచ్చడం తో రవితేజ వెంటనే కళ్యాణ్ కృష్ణ కు ఓకే చెప్పినట్లు సమాచారం ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్ లో నిర్మాతలు వెంకట్‌ తలారి, రామ్‌ తాళ్లూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ప్రస్తుత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాను జనవరిలో ప్రారంభించనున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాలో రవితేజ పాత్రను విభిన్నంగా డిజైన్ చేశారట దర్శకుడు కళ్యాణ్ కృష్ణ. ఈ సినిమాకు సంబందించిన పూర్తి వివరాలు త్వరలో తెలియనున్నాయి. ప్రస్తుతం రవితేజ నటించిన ‘టచ్ చేసి చూడు’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.

 
Like us on Facebook