రవితేజ “రామారావు ఆన్ డ్యూటీ” ఫస్ట్ సింగిల్ పై అనౌన్స్ మెంట్ నేడు…ఫుల్ స్వింగ్ లో ప్రమోషన్స్!

Published on Apr 7, 2022 12:00 pm IST

మాస్ మహారాజా రవితేజ కెరీర్ లో వరుస సినిమాలు చేస్తూ బిజిగా ఉన్నారు. క్రాక్ చిత్రం తో ట్రాక్ లోకి వచ్చిన రవితేజ ఖిలాడి తో ప్రేక్షకులను కాస్త నిరాశ పరిచారు. దానికి డబుల్ స్పీడ్ తో రామారావు ఆన్ డ్యూటీ తో మళ్ళీ సిద్దం అవుతున్నారు రవితేజ. శరత్ మండవ దర్శకత్వం లో రవితేజ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మి వేంకటేశ్వర సినిమాస్ మరియు RT టీమ్ వర్క్స్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. సామ్ సిఎస్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలకి ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి విశేష స్పందన లభిస్తోంది. ఈ చిత్రం నుండి తాజాగా చిత్ర యూనిట్ మరొక పోస్టర్ ను విడుదల చేయడం జరిగింది. ఈ చిత్రం నుండి ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈరోజు సాయంత్రం 4:05 గంటలకు ఫస్ట్ సింగిల్ కి సంబంధించిన ప్రకటన ను చేయనుంది.

ఈ చిత్రం లో రవితేజ సివిల్ సర్వెంట్ గా నటిస్తున్నారు. ఈ చిత్రం లో రజిషా విజయన్ మరియు దివ్యాన్ష కౌశిక్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. నాజర్, పవిత్రా లోకేష్, తనికెళ్ళ భరణి కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని జూన్ 17, 2022 న థియేటర్ల లో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఈ సినిమా కి సంబందించిన ప్రమోషన్స్ ను షురూ చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం :