“రామారావు ఆన్ డ్యూటీ” నుండి రవితేజ బర్త్ డే పోస్టర్ విడుదల…మామూలుగా లేదుగా!

Published on Jan 26, 2022 11:00 am IST


సుధాకర్ చెరుకూరి, SLV సినిమాస్, LLP మరియు RT టీమ్‌వర్క్స్‌ పై శరత్ మండవ దర్శకత్వం వహిస్తున్న మాస్ మహారాజా రవితేజ తాజా యాక్షన్ థ్రిల్లర్ రామారావు ఆన్ డ్యూటీ థియేట్రికల్ విడుదలకు సిద్ధమవుతోంది. ఈరోజు నుంచి రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ పాటను చిత్రీకరిస్తున్నారు. రవితేజ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ మేకర్స్ కొత్త పోస్టర్‌ ను విడుదల చేశారు.

యాక్షన్‌తో కూడిన పోస్టర్‌లో రవితేజ దూకుడుగా, ఎమోషనల్ కనిపిస్తున్నాడు. అతను తన భార్యతో ఒక చిత్రంలో కనిపిస్తే, అతని కుటుంబం మరొక చిత్రంలో చూడవచ్చు. ఒక పోస్టర్‌లో రవితేజ ఆఫీసులో తన పనిలో నిమగ్నమై ఉన్నట్లు కనిపిస్తుండగా, మరొక చిత్రంలో రైలు మండుతున్నట్లు ఉంది. రామారావు ఆన్ డ్యూటీ అనేది అన్ని ఎమోషన్స్‌తో కూడిన చిత్రమని మరియు అన్ని వర్గాలకు సంబంధించిన అంశాలు ఉంటాయని పోస్టర్ సూచిస్తుంది.

వేణు తొట్టెంపూడి కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో రవితేజ సరసన దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో కొందరు ప్రముఖ నటీనటులు కూడా ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం సామ్ సిఎస్ అందిస్తున్నారు. ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలకి ఇప్పటికే అద్భుతమైన స్పందన వచ్చింది. రామారావు ఆన్ డ్యూటీ మార్చి 25, 2022న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది.

రవితేజ, దివ్యషా కౌశిక్, రజిషా విజయన్, వేణు తొట్టెంపూడి, నాజర్, సీనియర్ నరేష్, పవిత్ర లోకేష్, సర్పట్ట జాన్ విజయ్, చైతన్య కృష్ణ, తనికెళ్ల భరణి, రాహుల్ రామ కృష్ణ, ఈరోజుల్లో శ్రీ, మధు సూదన్ రావు, సురేఖ వాణి తదితరులు నటించిన ఈ చిత్రానికి. కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం శరత్ మండవ, నిర్మాత సుధాకర్ చెరుకూరి, సంగీత దర్శకుడు సామ్ సిఎస్, DOP సత్యన్ సూర్యన్ ISC, ఎడిటర్ ప్రవీణ్ కెఎల్, ఆర్ట్ డైరెక్టర్ సాహి సురేష్, PRO వంశీ శేఖర్ లుగా వ్యవహరిస్తున్నారు.

సంబంధిత సమాచారం :