మాస్ మహారాజ “టైగర్ నాగేశ్వర రావు” నుండి సెకండ్ సింగిల్ కి డేట్ ఫిక్స్!

Published on Sep 18, 2023 4:33 pm IST

మాస్ మహారాజా రవితేజ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియన్ చిత్రం టైగర్ నాగేశ్వరరావు అక్టోబర్ 20, 2023న థియేట్రికల్ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రంలో నుపూర్ సనన్ మరియు గాయత్రి భరద్వాజ్ లు లేడీ లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. వినాయక చవితి సందర్భంగా ఒక ప్రత్యేక ప్రకటనలో, చిత్ర నిర్మాతలు వీడు పేరుతో రెండవ సింగిల్‌ను సెప్టెంబర్ 21, 2023న విడుదల చేయబోతున్నట్లు ధృవీకరించారు.

రవితేజ మాస్ అండ్ పవర్ ఫుల్ అవతార్‌లో ఉన్న పోస్టర్ ను విడుదల చేసారు. ఫస్ట్ సింగిల్ ఏక్ దమ్ ఏక్ దమ్ ప్రేక్షకులను అలరించడంతో వీడుపై అంచనాలు భారీగానే ఉన్నాయి. జి.వి.ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన ఈ సినిమా కోసం ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్, రేణు దేశాయ్, మురళీ శర్మ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం :