రామ్ చరణ్ సినిమా కొత్త షెడ్యూల్ మొదలయ్యేది ఎప్పుడంటే !


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – సుకుమార్ ల కొత్త చిత్రం ప్రస్తుతం విరామ సమయంలో ఉన్న సంగతి తెలిసిందే. గోదావరి జిల్లాల్లో నిర్విరామంగా షూటింగ్ చేయడం వలన, ఉష్ణోగ్రతలు మరీ ఎక్కువగా ఉండటం వలన నెలరోజులపాటు సెలవు తీసుకున్న టీమ్ ఈ నెల 5వ తేదీ అనగా సోమవారం నుండి రెండవ షెడ్యూల్ ను ఆరంభించనున్నారు.

అయితే ప్రస్తుతం లండన్ వెకేషన్లో బిజీగా ఉన్న రామ్ చరణ్ మాత్రం 8వ తేదీ నుండి షూటింగ్లో పాల్గొంటారట. ఈ షెడ్యూల్ కూడా గోదావరి పరిసర ప్రాంతాల్లో నే జరగనుంది. గ్రామీణ నైపథ్యంలో సాగే రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఉండనున్న ఈ చిత్రంలో సమంత హీరోయిన్ గా నటిస్తుండగా జగపతిబాబు, ఆది పినిశెట్టి, ప్రకాష్ రాజ్ లు పలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.