హైదరాబాద్లో సందడి చేయనున్న రామ్ చరణ్ !

ram ch
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. గత నెల 24 న ఈ చిత్రం యొక్క మొదటి షెడ్యూల్ విజయవంతంగా పూర్తైంది. దీంతో కొన్ని రోజులు గ్యాప్ తీసుకున్న చరణ్ ఈరోజు నుండి హైదరాబాద్లో రెండవ షెడ్యూల్ మొదలుపెట్టనున్నారు.

ఈ షెడ్యూల్లో రామ్ చరణ్ పై కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ జరగనుందని తెలుస్తోంది. ఈ చిత్రంలో రామ్ చరణ్ ఇదివరకటిలా కాకుండా పూర్తిగా ఒక పల్లెటూరి యువకుడిగా కనిపించనుండటం, చరణ్ కు జంటగా స్టార్ హీరోయిన్ సమంత నటిస్తుండటంతో ఈ సినిమాపై మెగా అభిమానుల్లోనేగాక సినీ ప్రేక్షకులందరిలోను తీవ్ర ఆసక్తి నెలకొంది. ఇకపోతే రత్నవేలు సినిమాటోగ్రఫీ, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్న ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది.