RC15 కాన్సెప్ట్ పోస్టర్‌కు ఎంత ఖర్చు పెట్టారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

RC15 కాన్సెప్ట్ పోస్టర్‌కు ఎంత ఖర్చు పెట్టారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Published on Sep 9, 2021 12:44 AM IST


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ నేడు పూజా కార్యక్రమాలను జరుపుకుంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్‌ ఓ కాన్సెప్ట్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. రామ్‌చరణ్‌, కియారా, డైరెక్టర్‌ శంకర్‌తో పాటు మొత్తం కాస్ట్‌ అండ్‌ క్రూడ్‌ ఈ పోస్టర్‌లో కనిపిస్తున్నారు. అందరూ షూటు ధరిచి చేతిలో ఫైల్స్ పట్టుకుని స్టైలిష్‌గా నడుస్తూ వస్తున్న ఈ పోస్టర్ అందరిని విపరీతంగా ఆకట్టుకుంటుంది.

అయితే శంకర్ చేసే సినిమాలన్ని భారీ బడ్జెట్ లెక్కలతోనే ఉంటాయన్నది మనకు తెలిసిందే. కాగా ఈ సినిమాకు కూడా దిల్‌ రాజు రూ.250 కోట్లు కేటాయించినట్లు సమాచారం. అయితే నేడు విడుదలైన కాన్సెప్ట్‌ పోస్టర్‌కు ఏకంగా కోటి 73 లక్షల రూపాయలు ఖర్చు పెట్టినట్టు ఫిల్మ్ సర్కిల్స్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరీ ఇప్పుడే ఇంత ఖర్చు పెట్టారంటే మున్ముందు ఈ సినిమా బడ్జెట్ ఇంకా పెరిగే అవకాశాలు ఎక్కువగానే ఉంటాయని సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ అక్టోబర్‌లో ప్రారంభం కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు