RC15 లేటెస్ట్ షెడ్యూల్ షూట్ వాయిదా పడిందా ?

RC15 లేటెస్ట్ షెడ్యూల్ షూట్ వాయిదా పడిందా ?

Published on Dec 27, 2022 3:02 AM IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కియారా అద్వానీ హీరోయిన్ గా శంకర్ దర్శకత్వంలో ప్రస్తుతం ఒక భారీ ప్రాజక్ట్ షూటింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. RC15 వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ మూవీకి థమన్ సంగీతం అందిస్తుండగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు దీనిని భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు. ఇక ఈ మూవీ భారీ యాక్షన్ థ్రిల్లింగ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది.

కాగా ఈ మూవీ భారీ పాన్ ఇండియా రేంజ్ లో రూపొందుతుండగా దీని పై మెగా ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు ఉన్నాయి. అయితే విషయం ఏమిటంటే ఈ మూవీకి సంబంధించి లేటెస్ట్ గా కర్నూలు కొండారెడ్డి బురుజు ప్రాంతంలో జరగవలసిన తాజా షూట్ కొద్దిరోజుల పాటు వాయిదా పడినట్లు తెలుస్తోంది. అతి త్వరలో దీనిని కొనసాగించేందుకు యూనిట్ ప్రణాళికలు సిద్ధం చేస్తోందట. కాగా ఈ మూవీ వచ్చే ఏడాది సమ్మర్ లో గ్రాండ్ లెవెల్లో రిలీజ్ అయ్యే అవకాశం కనపడుతోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు