లేటెస్ట్ అప్ డేట్ : RC 15 మ్యూజిక్ సిట్టింగ్స్ లో థమన్, శంకర్

Published on Jun 25, 2022 12:00 am IST

ఇటీవల దిగ్గజ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్ తో అతిపెద్ద బ్లాక్ బస్టర్ సక్సెస్ కొట్టిన టాలీవుడ్ స్టార్ హీరో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ప్రముఖ దర్శకుడు శంకర్ తో ఒక ప్రతిష్టాత్మక పాన్ ఇండియా మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తుండగా సూపర్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇటీవల కొన్నాళ్లుగా వేగవంతంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీకి ఇంకా టైటిల్ నిర్ణయం కాలేదు.

ఆర్ సి 15 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై మెగా ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ అందరిలో బాగా అంచనాలు ఉన్నాయి. అయితే మ్యాటర్ ఏమిటంటే, తమ సినిమాకి సంబంధించి ప్రస్తుతం మ్యూజిక్ సిట్టింగ్స్ ఫుల్ స్వింగ్ లో జరుగ్తున్నాయని, తనకు ఎంతో ఇష్టమైన దర్శకుడు శంకర్ సిట్టింగ్స్ లో తనతో పాటు పాల్గొంటున్నారని, అలానే చరణ్ గారితో కొంత గ్యాప్ తరువాత చేస్తున్న ఈ మూవీ కోసం అందరం ఎంతో హార్డ్ వర్క్ చేస్తున్నట్లు తన పోస్ట్ లో చెప్పుకొచ్చిన థమన్, మ్యూజిక్ సిట్టింగ్స్ సమయంలో దర్శకుడు శంకర్ తో కలిసి దిగిన ఫోటోని కూడా పోస్ట్ చేసారు. కాగా ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదల కానున్నట్లు సమాచారం.

సంబంధిత సమాచారం :