“చరణ్15” కేక..సినిమా విలన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.!

“చరణ్15” కేక..సినిమా విలన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.!

Published on Nov 26, 2022 7:25 PM IST


ప్రస్తుతం మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మన ఇండియన్ మావెరిక్ దర్శకుడు శంకర్ తో ఓ భారీ పాన్ ఇండియా సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. మరి చరణ్ మరియు శంకర్ ల కెరీర్ లో ఈ చిత్రం 15వ సినిమా కాగా దీనిపై భారీ స్థాయి అంచనాలు అయితే నెలకొన్నాయి.

ఇక ఈ భారీ సినిమా షూటింగ్ ఇప్పుడు శరవేగంగా కంప్లీట్ అవుతూ ఉండగా ఈ చిత్రంలో విలన్ పాత్ర చేస్తున్నటువంటి వెర్సటైల్ నటుడు ఎస్ జే సూర్య లేటెస్ట్ గా ఓ ఇంటర్వ్యూ లో చేసిన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ ఆసక్తిగా మారాయి. ఈ సినిమా సింపుల్ గా కేక అని.. శంకర్ గారు తన గత చిత్రాల్లానే ఎంతో కేర్ గా కాపాడుకుంటూ చేస్తున్నారని అందుకే అంతకు మించి ఎక్కువ నేను చెప్పలేనని తాను చెప్పారు.

దీనితో అయితే ఈ కామెంట్స్ చరణ్ ఫ్యాన్స్ లో మంచి ఎగ్జైట్మెంట్ గా ఫీల్ అవుతున్నారు. ఇక ఈ చిత్రంలో అయితే కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు. అలాగే వచ్చే ఏడాది రిలీజ్ కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు