ఐకానిక్ ప్లేస్ లో RC 15 నెక్స్ట్ షెడ్యూల్ – డైరెక్టర్ శంకర్

Published on Feb 9, 2023 9:28 pm IST


టాలీవుడ్ స్టార్ నటుల్లో ఒకరైన మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కియారా అద్వానీ హీరోయిన్ గా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ RC 15 మూవీ పై అందరి లో మంచి అంచనాలు ఉన్నాయి. దిల్ రాజు నిర్మాతగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ఎంతో భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ పాన్ ఇండియన్ మూవీకి థమన్ సంగీతం అందిస్తుండగా తిరు, రత్నవేలు ఫోటోగ్రఫి అందిస్తున్నారు.

అయితే విషయం ఏమిటంటే, ప్రస్తుతం వరుసగా షెడ్యూల్స్ జరుపుకుంటున్న ఈ మూవీ యొక్క నెక్స్ట్ షెడ్యూల్ ని హైదరాబాద్ లోని ఐకానిక్ ప్రాంతం చార్మినార్ వద్ద నిర్వహించనున్నట్లు కొద్దిసేపటి క్రితం దర్శకుడు శంకర్ స్వయంగా తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా తెలిపారు. భారీ పొలిటికల్ యాక్షన్ మాస్ డ్రామా మూవీగా రూపొందుతున్న ఈ మూవీ అత్యధిక బడ్జెట్ తో రూపొందుతుండగా ఫస్ట్ లుక్ ని అతి త్వరలో రిలీజ్ చేయడానికి యూనిట్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత సమాచారం :