శరవేగంగా “RC15” షూటింగ్!

శరవేగంగా “RC15” షూటింగ్!

Published on Nov 8, 2022 3:01 AM IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. టైటిల్ ఇంకా ఖరారు కానీ ఈ చిత్రం RC15 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతోంది. ఈ చిత్రం కి సంబంధించిన షూటింగ్ మరింత స్పీడ్ అందుకోనుంది.

ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం లోని సాంగ్స్ కోసం మేకర్స్ ప్రత్యేక శ్రద్ద చూపుతున్నట్లు తెలుస్తోంది. న్యూజిలాండ్ లో ఒక ప్రత్యేక సాంగ్ ను చిత్రీకరించనున్నారు. ఈ నెల 20 నుండి పాటల చిత్రీకరణ షురూ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ చిత్రం లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా కియారా అద్వానీ నటిస్తుంది. ఈ చిత్రం కి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు