RC 15 : ఆ టైటిల్ ఇక లాంఛనమే

RC 15 : ఆ టైటిల్ ఇక లాంఛనమే

Published on Mar 18, 2023 6:05 PM IST


మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, దిగ్గజ దర్శకుడు శంకర్ ల కలయికలో తెరకెక్కుతున్న RC 15 మూవీ పై మెగా ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీకి థమన్ సంగీతం అందిస్తుండగా శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు దీనిని గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. ఇక ఈ మూవీ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటూ ఉండగా ఇందులో శ్రీకాంత్, ఎస్ జె సూర్య, అంజలి, సునీల్ తదితరులు కీలక పాత్రలు చేస్తున్నారు.

భారీ యాక్షన్ తో కూడిన పొలిటికల్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ మూవీ కి CEO అనే టైటిల్ ని యూనిట్ పరిశీలిస్తున్నట్లు ఇప్పటికే పలు మీడియా మాధ్యమాల్లో కథావలు వస్తున్నాయి. అయితే లేటెస్ట్ టాలీవుడ్ బజ్ ప్రకారం ఆ టైటిల్ ని యూనిట్ ఆల్మోస్ట్ ఓకే చేసినట్లు తెలుస్తోంది. అలానే రామ్ చరణ్ ఈ సినిమాలో పవర్ఫుల్ రోల్ చేస్తుండగా శ్రీకాంత్ రోల్ కూడా అదిరిపోనుందట. ఇక ఈ టైటిల్ ప్రకటించడం లాంఛనమే అని, దీనిని మార్చి 27న రామ్ చరణ్ బర్త్ రోజున అధికారికంగా అనౌన్స్ చేయనున్నారట. కాగా ఈమూవీ యొక్క రిలీజ్ కి సంబంధించి కూడా అప్పుడే పూర్తి డీటెయిల్స్ వెల్లడి కానున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు