డైరెక్టర్ బుచ్చిబాబుతో మెగా పవర్ స్టార్ పాన్ ఇండియా మూవీ..!

డైరెక్టర్ బుచ్చిబాబుతో మెగా పవర్ స్టార్ పాన్ ఇండియా మూవీ..!

Published on Nov 28, 2022 11:17 AM IST

రౌద్రం రణం రుధిరం చిత్రం భారీ విజయం తో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ దూసుకు పోతున్నారు. రామ్ చరణ్ ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తో భారీ బడ్జెట్ చిత్రాన్ని చేస్తున్నారు. ఈ చిత్రం తర్వాత రామ్ చరణ్ ఎలాంటి ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేయలేదు. అయితే నేడు తన తర్వాత ప్రాజెక్ట్ కి సంబంధించిన ప్రకటన వచ్చేసింది.

సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ చిత్రం ఉప్పెనతో అరంగేట్రం చేసిన యంగ్ డైరెక్టర్ బుచ్చిబాబు సనా, రామ్ చరణ్‌ నెక్స్ట్ మూవీ RC16 కి దర్శకత్వం వహించనున్నాడు. దర్శకుడు దీనిని పాన్ ఇండియా ఎంటర్టైనర్‌గా రూపొందించడానికి యూనివర్సల్ అప్పీల్‌ తో పవర్ ఫుల్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేశారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సగర్వంగా సమర్పిస్తున్న వెంకట సతీష్ కిలారు వృద్ధి సినిమాస్ మరియు సుకుమార్ రైటింగ్స్ బ్యానర్‌లపై అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని అత్యంత భారీ స్థాయిలో నిర్మించనున్నారు.

ఈ చిత్రం కి సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో వెల్లడిస్తామన్నారు మేకర్స్.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు