ఇప్పుడు టాలీవుడ్ సినిమా నుంచి రానున్న పలు క్రేజీ ప్రాజెక్ట్ లలో దర్శకుడు సుకుమార్ అలానే మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ల కలయికలో తెరకెక్కే సినిమా కూడా ఒకటి. పెద్ది లాంటి భారీ సక్సెస్ తర్వాత రామ్ చరణ్, ఇంకోపక్క పుష్ప 2 లాంటి పాన్ ఇండియా బిగ్గెస్ట్ హిట్ తర్వాత సుకుమార్ వీటికి మించి రంగస్థలం అనే ఐకానిక్ కాంబినేషన్ తర్వాత కలుస్తున్న కలయిక కావడంతో అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి.
ఇక ఈ మ్యాడ్ కాంబినేషన్ పై నిర్మాత రవి శంకర్ ఎన్ని అంచనాలు పెట్టుకున్నా అంతకు మించే వీరి సినిమా ఉంటుంది అని ప్రామిస్ చేస్తున్నారు. ఒక బెంచ్ మార్క్ సెట్ చేసిన కాంబినేషన్ ఇది. సో డెఫినెట్ గా రంగస్థలం కి మించే ఈ సినిమా ఉండబోతుంది అని త్వరలోనే సినిమాపై అప్డేట్ కూడా అందిస్తామని కన్ఫర్మ్ చేశారు. ఇక ఈ భారీ సినిమా ఈ ఏడాది నవంబర్ నుంచి మొదలు కానున్నట్టుగా టాక్. దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.
